వర్గల్: మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య

84చూసినవారు
వర్గల్: మనస్తాపానికి గురై యువకుడు ఆత్మహత్య
మనస్తాపానికి గురైన యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన వర్గల్ మండలం నెంటూరులో చోటు చేసుకుంది. మంగళవారం బేగంపేట ఎస్ఐ మహిపాల్ రెడ్డి వివరాల మేరకు గ్రామానికి సాయికిరణ్ ఓ కంపెనీలో పని చేస్తున్నాడు. ఈ క్రమంలో కుటుంబ గొడవలతో మనస్తాపానికి గురయ్యాడు. గ్రామ శివారులో వేప చెట్టుకు చీరతో ఉరేసుకున్నాడు. మంగళవారం గ్రామస్తులు గమనించి కుటుంబీకులకు తెలియజేశారు. మృతుని తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు

సంబంధిత పోస్ట్