బక్రీద్ పండగ సందర్భంగా ముస్లిం సోదరులకు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ శుభాకాంక్షలు తెలిపారు. త్యాగనిరతికి బక్రీద్ తార్కాణమన్నారు. దేవునిపై విశ్వాసంతో సన్మార్గంలో నడవాలనే గొప్ప సందేశాన్ని మానవాళికి ఇస్తుందన్నారు. మహ్మద్ ప్రవక్త ఆశీస్సులు తెలంగాణ ప్రజలపై ఎల్లవేళలా ఉండేలా చూడాలని, ప్రజాపాలనలో అంతా మంచి జరగాలని కోరారు.