క్రైస్తవ సోదరులకు క్రిస్మస్ శుభాకాంక్షలు: మంత్రి

79చూసినవారు
క్రిస్మస్ పండగ శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం మానవత్వం చాటే పవిత్రమైన పండగని, ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు విరజిల్లుతూ సంతోషం, శాంతి నింపాలని మంత్రి పొన్నం ప్రభాకర్ క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. క్రీస్తు బోధనలు ఆచరణీయమని, ఆయన బోధనలు కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని, యావత్తు మానవాళికి మేలు చేసేవని అన్నారు. ఏసుక్రీస్తు సందేశాన్ని ప్రతి ఒక్కరూ పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్