సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని జిల్లెల గడ్డ గ్రామంలో తెలంగాణ గిరిజన సంక్షేమ బాలుర గురుకుల పాఠశాల మరియు ప్రతిభ కళాశాలను శనివారం జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ సందర్భంగా అదనపు టాయిలెట్స్, అదనపు సంపు నిర్మాణం కావాలని ప్రిన్సిపల్ అడుగగా ప్రాధాన్యత ప్రకారం అన్ని అందిస్తామని తెలిపారు. గురుకుల ప్రాంగణం మొత్తం చుట్టూ సర్వే చేసి బౌండరీ హద్దులు వెయ్యాలని తహసిల్దార్ ని ఆదేశించారు.