సీపీఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు వేల్పుల బాలమల్లు పార్టీకి చేసిన సేవలు మరువలేనివని, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి అన్నారు. సీపీఐ పార్టీలో పని చేసే ప్రతి కార్యకర్తకు సిపిఐ పార్టీ అండగా ఉంటుందని ఆయన అన్నారు. సిద్దిపేట జిల్లా కోహెడ మండలం సముద్రాల గ్రామంలో నిర్వహించిన బాలమల్లు దశదినకర్మకు హాజరైనా సీపీఐ పార్టీ నాయకత్వం ఆయన కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సహాయం అందించారు.