కొమురవెల్లి మండలంలోని మల్లికార్జున స్వామి ఆలయంలో ఆదివారం భక్తుల సందడి నెలకొంది. భక్తులు కొమురవెల్లిలోని దేవాలయ సత్రాలలో, ప్రయివేట్ గదులలో బసచేసి ఆదివారం ఉదయం నుంచే కోనేరులో స్నానం ఆచరించి మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు, పట్నం, అభిషేకం, అర్చన, నిత్యకళ్యాణం, బోనం, తిరుగుడు కోడె, కేశ కండన కార్యక్రమంలలో పాల్గొన్నారు.