నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం

75చూసినవారు
నేడు పలు గ్రామాల్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం
విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మతుల కారణంగా విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడుతుందని ఏఈ రవీందర్ తెలిపారు. శుక్రవారం శనిగరం 132/33 కేవీ సబ్ స్టేషన్లో మరమ్మతులు చేపడుతున్నందున కోహెడ, రామచంద్రాపూర్, సముద్రాల, శనిగరం, చంచెల్ చెర్వుపల్లి గ్రామాలతో పాటుగా బెజ్జంకి మండలం బెజ్జంకి, బేగంపేట, కల్లేపల్లి, రేగులపల్లి, గుగ్గిళ్ల, తోటపల్లి, వడ్లూరు, దాచారం, గూడెం గ్రామాల్లో ఉదయం 7 నుంచి 10 గంటల వరకు విద్యుత్ ఉండదని అన్నారు.

సంబంధిత పోస్ట్