ఖరీఫ్ సీజన్ ప్రారంభం కాబోతున్న తరుణంలో రైతులు విత్తనాలు కొనే ముందు అప్రమత్తంగా ఉంటూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ విస్తరణాధికారి ప్రణీత సూచించారు. సోమవారం హుస్నాబాద్ మండలంలోని మడద, రాములపల్లి గ్రామాలలో రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. రైతులు విత్తనాలు కొనే ముందు ఆయా ప్రాంతాలలో ఉన్న లైసెన్స్ పొందిన డీలర్ల వద్ద మాత్రమే విత్తనాలు కొనుగోలు చేసి రసీదు తప్పకుండా తీసుకోవాలని సూచించారు.