హనుమకొండ: బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దీక్ష

78చూసినవారు
హనుమకొండ: బీసీలకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని దీక్ష
గత ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీసీలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, కామారెడ్డి డిక్లరేషన్ పేరిట ఇచ్చిన హామీలు అమలుపరచాలని శనివారం హనుమకొండ జిల్లా కేంద్రంలోని ధర్నా చౌక్ లో బీసీ ఆజాది యూత్ ఫెడరేషన్ జాతీయ అధ్యక్షులు సంజయ్ కుమార్ నేతృత్వంలో సత్యాగ్రహ దీక్ష చేపట్టారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు కుడికాల భాస్కర్ అధ్యక్షత వహించగా జర్నలిస్టులు కేశవమూర్తి పూలమాలలు వేసి దీక్ష ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్