హుస్నాబాద్ పట్టణంలోని సిద్దేశ్వరుని దేవాలయానికి 8 కిలోల వెండి కిరాటాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గురువారం బహుకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గ గ్రామ ప్రజలపై సిద్దేశ్వరుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పట్టణ ప్రజలు, అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.