హుస్నాబాద్: బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలి: మంత్రి

1చూసినవారు
జాతీయ రహదారి పనుల్లో భాగంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని రేణుక ఎల్లమ్మ వాగుపై చేపట్టిన పందిళ్ల బ్రిడ్జి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. శనివారం బ్రిడ్జి పనులను మంత్రి పొన్నం పరిశీలించారు. గత వాన కాలంలో కూడ బ్రిడ్జి లేకపోవడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని అన్నారు. బ్రిడ్జి నిర్మాణ పనుల్లో వేగం పెంచి వర్షాకాలంలో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్