హుస్నాబాద్: బస్ ఛార్జ్ పెంపుతో పేద మధ్యతరగతి ప్రజలపై భారం

52చూసినవారు
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బస్ ఛార్జీలను 20% శాతం పెంచడాన్ని బీజేపీ హుస్నాబాద్ పట్టణ అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు తీవ్రంగా వ్యతిరేకించారు. హుస్నాబాద్ పట్టణంలో మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ. పేద, మధ్యతరగతి ప్రజలు, విద్యార్థులపై భారం పడుతుందని, మహాలక్ష్మి పథకం గొప్పలు చెబుతూనే ఛార్జీలు పెంచడం తగదని అన్నారు. వెంటనే పెంపును ఉపసంహరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు ఉన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్