ప్రజా పాలన ప్రభుత్వం 2024 సంవత్సరం పూర్తి చేసుకొని 2025 సంవత్సరంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా తెలంగాణ ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలను హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ తెలియజేశారు. అనంతరం మాట్లాడుతూ రవాణా శాఖ మంత్రిగా మీ అందరూ సురక్షిత ప్రయాణం చేయాలని ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రాణాపాయం లేకుండా ఇతరులకు ఇబ్బందులు లేకుండా రోడ్డు నిబంధనలు పాటించాలని అన్నారు.