శాంతి, ప్రేమ, సౌభ్రాతృత్వం, మానవత్వం చాటే పవిత్రమైన పండుగ క్రిస్మస్ అని రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. హుస్నాబాద్ క్యాంపు కార్యాలయంలో బుధవారం రాత్రి క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. క్రిస్మస్ కేవలం ఏదో ఒక మతానికి మాత్రమే సంబంధించినవి కావని యావత్తు మానవాళికి మేలు చేసేవని అన్నారు. సహనానికి, దయ, కరుణ మూర్తీభవించిన రూపమే జీసస్ అని అన్నారు.