హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని పందిళ్ళ గ్రామంలో బుధవారం ఏరువాక పౌర్ణమి సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాందాటి వెంకట్ రెడ్డి పొలంలో ఎడ్లతో నాగలి దున్ని రైతులతో కలిసి పెసర విత్తనాలు చల్లారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతులు ఒక్క గుంట కూడా బీడు లేకుండా వరి, మొక్కజొన్న , ఆయిల్ ఫాం ఇతర ఏదైనా పంటలు వేయాలని, రైతులు ఎక్కడ ఖాళీ జాగా బీడు లేకుండా చూడాలన్నారు. ఈసారి మంచి వర్షాలు, పాడి పంటలతో ఉండాలన్నారు.