సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయ చైర్మన్ కొమురవెల్లి చంద్రశేఖర్ తల్లి కొమురవెల్లి మణెమ్మ ఇటీవల మరణించడంతో శుక్రవారం భీమదేవరపల్లి మండలం కొత్తపల్లిలోని వారి స్వగృహానికి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ వెళ్లి చంద్రశేఖర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, తదితరులు పాల్గొన్నారు.