ఏప్రిల్ 27న ఎల్కతుర్తి బీఆర్ఎస్ రజతోత్సవ సభకు వెళ్లి వస్తున్న వాహన ఢీకొని మరణించిన ఇద్దరు మృతులకు రూ. 2 లక్షల చొప్పున మంత్రి పొన్నం ప్రభాకర్ ఆర్థిక సహాయం అందజేశారు. హుస్నాబాద్ నియోజకవర్గం బస్వాపూర్ కు చెందిన తాడేం సారయ్య, బండోజు గణేష్ లు మృతి చెందారు. వారి కుటుంబాలను ఆదుకుంటామని చెప్పిన మంత్రి బుధవారం బస్వాపూర్ గ్రామంలో వారి నివాసాలకు వెళ్ళి ఒక్కొక్కరి కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున ఆర్థిక సహాయం చేశారు.