రాజీవ్ యువ వికాసం గడువును ఏప్రిల్ చివరికి వరకు పొడిగించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, కాంటెస్టేడ్ ఎమ్మెల్సీ పిడిశెట్టి రాజు కోరారు. ఈసందర్బంగా వారు మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 6వేల కోట్లతో చేపట్టిన ఈ పథకం గడువు పొడిగించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ లకు లేఖలు రాసినట్టు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు.