బుధవారం హుస్నాబాద్ లో విలేకరుల సమావేశంలో బత్తుల జగదీష్ మాట్లాడుతూ లక్ష డప్పులు వేల గొంతుల ప్రదర్శన కార్యక్రమానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడం పట్ల మందకృష్ణ మాదిగ ఈ సభను వాయిదా వేశారన్నారు. వాయిదా వేయడం పట్ల నిరుత్సాహం పడవద్దని, మాదిగ మరియు ఉపకులాలు ఎవరు నిరుత్సాహ చెందవద్దన్నారు. మరలా త్వరలోనే తేదిని ప్రకటిస్తారని తెలిపారు. వర్గీకరణలో 2 శాతం తగ్గించడం మాదిగ యువకులకు, విధ్యార్థులకు బాధాకరమన్నారు.