హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్ యార్డ్ లో మక్కల కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడంలో మార్కెట్ కమిటీ పాలకవర్గం విఫలం అయ్యారని హుస్నాబాద్ బీఎస్పీ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జ్ పచ్చిమట్ల రవీందర్ గౌడ్ దుయ్యబట్టారు. ఆయన బుధవారం మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ ఉన్నది రైతులు తమ పంట పండించిన ఉత్పత్తులను అమ్ముకునేందుకు అనువుగా ఉన్న పాలకవర్గం ఎందుకు ప్రయత్నం చేయడం లేదో రైతులకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.