హుస్నాబాద్: క్రైస్తవుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం

66చూసినవారు
ఏసు ప్రభువు అందరికీ కరుణామయుడేనని, ఏసును ఆదర్శంగా తీసుకుని అందరూ ముందుకు సాగాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం హుస్నాబాద్ పట్టణంలో నియోజకవర్గ స్థాయి క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొని మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవుల సంక్షేమానికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు తెలిపారు. కమ్యూనిటీ భవన నిర్మాణం కోసం 2 ఎకరాల భూమిని కేటాయిస్తామని, స్థలసేకరణ చేపట్టాలని ఆర్డీఓను ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్