హుజురాబాద్ నియోజకవర్గంలో కాకతీయ కెనాల్ ద్వారా సాగు కోసం నీళ్లు విడుదల చేయడంతో రైతులు యాసంగి పంట దుక్కులు సిద్ధం చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా నీటి విడుదలలో సందిగ్ధం నెలకొనడంతో రైతన్నలు యాసంగి పంట వేయడం కోసం ఎదురుచూడ సాగారు. బుధవారం నుండి నీటి విడుదలతో కాకతీయ ఉపకాల్వల ద్వారా ఆయకట్టు రైతులకు నీరు చేరడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.