ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు

55చూసినవారు
ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు
జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగనున్న పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని సిద్దిపేట పోలీసు కమిషనర్ అనురాధ తెలిపారు. ఈ నెల 24 నుంచి జూన్ 3 వరకు పరీక్షలు జరగనున్నందున పరీక్షా కేంద్రాల వద్ద నిబంధనలు అమలులో ఉంటాయన్నారు. పరీక్షా కేంద్రాల సమీపంలోని అన్ని జిరాక్స్ సెంటర్లు మూసి వేసి ఉంచాలని, 500 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడి ఉండకూడదని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్