హుస్నాబాద్ వ్యవసాయ మార్కెట్లో కొంతమంది దళారులు లైసెన్స్ లేకుండా పచ్చి వడ్లను తక్కువ ధరకు (1700 రూపాయలకు) కొనుగోలు చేస్తూ మార్కెట్లో మద్దతు ధరకు అమ్ముకుంటున్నారు. ఇట్టి విషయంలో మార్కెట్ అధికారులు, ఐకెపి కొనుగోలుదారులు చర్యలు తీసుకుని కేసు నమోదు చేయాలని రైతు సంఘాల పక్షాన రైతు ఐక్యత సంఘం నాయకులు రవీందర్ గౌడ్ శనివారం విజ్ఞప్తి చేయడం జరిగింది. కొంతమంది అధికారుల అండదండలతోనే కొనుగోలు జరుగుతుందని ఆయన తెలిపారు.