భారతరత్న స్వర్గీయ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు 20వ వర్ధంతి సందర్భంగా సోమవారం పీవీ ఘాట్ వద్ద హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తెలంగాణ ముద్దు బిడ్డ, నేను ప్రాతినిధ్యం వహిస్తున్న హుస్నాబాద్ కి సంబంధించిన బిడ్డ, వారు అత్యున్నత స్థానానికి ఎదగడానికి మన అందరికీ గర్వకారణమని అన్నారు. మారుమూల ప్రాంతం నుండి భారత ప్రధాని కావడం మన అందరికీ గర్వ కారణమని అన్నారు.