అహ్మదాబాద్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో 265 మంది మృతి చెందడం బాధాకరమని బీజేపీ మండల అధ్యక్షుడు బత్తుల శంకర్ బాబు తెలిపారు. శుక్రవారం బీజేపీ నేతలతో కలిసి మృతి చెందిన వారికి నివాళులు అర్పించారు. హుస్నాబాద్ ఏబీవీపీ నాయకుడు ఆదిత్య పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. నిందితులను తక్షణమే గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.