సిద్దిపేట జిల్లా తంగళ్ళపల్లి కస్తూర్బాగాంధీ బాలికల విద్యాలయంలో అవసరమైన మౌలిక పరిస్థితులను మెరుగుపరిచేందుకు చర్యలు తీసుకుంటానని జిల్లా కలెక్టర్ ఎం. మనుచౌదరి అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మాత్తుగా కోహెడ మండలంలోని తంగళ్ళపల్లి కేజీబీవీని సందర్శించి విద్యాలయంలో విద్యార్థులకు గల సౌకర్యాలను పరిశీలించారు.