
మరోసారి రూ.లక్ష దాటిన బంగారం ధర
బంగారం ధర మరోసారి రూ.లక్ష దాటింది. హైదరాబాద్లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,210 పలుకుతోంది. కిలో వెండి ధర రూ.1,08,700 పలుకుతోంది. డాలర్ స్వల్పంగా బలహీనపడిన నేపథ్యంలో బంగారం ధరలో పెరుగుదల ఉన్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు.