షేక్ పెట్ సాంఘిక సంక్షేమ గురుకుల బాలుర పాఠశాలను శనివారం హుస్నాబాద్ ఎమ్మెల్యే, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ పరిశీలించారు. ఈ సందర్భంగా సంక్షేమ పాఠశాలలో లైబ్రరీ, కంప్యూటర్ ల్యాబ్, డిజిటల్ క్లాస్ రూం ద్వారా విద్యార్థులకు అందే ప్రత్యేక కోర్సులు, తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకుల పాఠశాలలో కామన్ డైట్ మెనూను ప్రారంభించి విద్యార్థులతో కలిసి మంత్రి పొన్నం ప్రభాకర్ భోజనం చేశారు.