అర్హులందరికీ ఇందిరమ్మ ఇల్లు ఇవ్వడమే ప్రభుత్వ లక్ష్యమని శుక్రవారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ అన్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలం గోవర్ధనగిరి గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారు సింగపాక మల్లవ్వ ఇంటి నిర్మాణానికి మంత్రి భూమి పూజ చేశారు. ప్రజా పాలన ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇళ్లు తనకు మంజూరు అయినందుకు సింగపాక మల్లవ్వ ఆనందభాష్పాలు రాల్చారు.