సిద్ధిపేట జిల్లా చిన్నకోడూరు మండలములోని ఇబ్రహీంనగర్ లో వర్షాలకు వరి, మిరప పంటలు నష్టపోవడంతో నష్టపోయిన పంటలను శుక్రవారం మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, శ్రీధర్ బాబు పరిశీలించారు. ఈ సందర్బంగా పంటలు ఎక్కడెక్కడ నష్టపోయాయో అధికారులు ఫీల్డ్ కి వెళ్లి వివరాలు నమోదు చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్ కు ఆదేశాలు జారీ చేశారు. పంట నష్టపోయిన రైతులను ఆదుకుంటామని హామీనిచ్చారు.