పోలీసు శాఖలో ది బెస్ట్ ఫ్రెండ్లీ పోలీస్ గా పేరుపొందిన మొగిలి నాయక్ కు ఉత్తమ ప్రతిభ కనబరిచినందుకు రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, సిపి అనురాధ చేతుల మీదుగా గురువారం సిద్దిపేటలో ప్రశంసా పత్రం అందుకున్నారు. హుస్నాబాద్ నియోజకవర్గం అక్కన్నపేట మండలంలోని పెద్దతండ గ్రామానికి చెందిన మొగిలి నాయక్ హెడ్ కానిస్టేబుల్ గా పోలీస్ శాఖలో ఎనలేని సేవ చేశారన్నారు.