ఎస్సీ వర్గీకరణ చట్టం అమలు అయ్యేంతవరకు ప్రభుత్వ ఉద్యోగ నియమకాలు నిలిపివేయాలనే డిమాండ్ తో ఎంఆర్‌పీఎస్ చేపట్టిన దీక్ష 4వ రోజుకు చేరింది. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ లో చేపట్టిన దీక్షా శిబిరాన్ని హనుమకొండ జిల్లా పరిషత్ మాజీ చైర్మన్ సుధీర్ కుమార్ సందర్శించారు. ఈ సందర్బంగా ఎంఆర్‌పీఎస్ నిరసన దీక్షకు సంపూర్ణ మద్దతు తెలిపారు.