సహకార వ్యవస్థలో ముల్కనూరు సొసైటీ ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తుందని జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి బుధవారం అన్నారు. భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ సొసైటీ ఆయన సందర్శించారు. ముల్కనూర్ రైస్ కు ఇతర రాష్ట్రాల్లో సైతం డిమాండ్ ఉండడంతో ఆ రైస్ తయారీ విధానాన్ని పరిశీలించారు. రైతులు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యాన్ని అమ్మితే గిట్టుబాటు ధర లభిస్తుందని ఆయన అన్నారు. సొసైటీ ఉపాధ్యక్షులు కడారి ఆదం పాల్గొన్నారు.