పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించేలా గ్రామాల్లో తల్లిదండ్రులు చొరవ తీసుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మంగళవారం కోహెడ మండలం బస్వాపూర్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇన్ఫినేటివ్ విద్యా ఫౌండేషన్ సహకారంతో కంప్యూటర్, సైన్స్, రోబోటిక్ ల్యాబ్ లను కలెక్టర్ మనుచౌదరితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో సదుపాయాలు, అవకాశాలను విద్యార్థులు ఉపయోగించుకోవాలని చెప్పారు.