సిద్దిపేట జిల్లా బస్వాపూర్ లో బ్రిడ్జి నిర్మాణం చేస్తున్న ఎనిమిది మంది వలస కూలీలను పోలీసులు కాపాడారు. మోయతుమ్మెద వాగు వరద నీటిలో చిక్కుకోగా స్థానికుల సమాచారంతో హుస్నాబాద్ ఏసీపీ వాసాల సతీశ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకున్నారు. పోలీస్ సిబ్బంది, గ్రామస్తుల సహకారంతో కూలీలను కాపాడి బస్వాపూర్ రైతు వేదికకు తరలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ వాగు పరిసరాలకు ఎవరూ రావొద్దని సూచించారు.