సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ అక్కన్నపేట మండలాల్లోని పలు గ్రామాల్లో విద్యుత్ మరమ్మతుల కారణంగా ఆదివారం విద్యుత్ సరఫరా నిలిపివేస్తున్నట్లు ఏడీ దుర్గా శ్రీనివాస్ తెలిపారు. పందిల్ల, ధర్మారం, రామవరం సబ్ స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో ఉదయం 8 నుంచి 10. 30 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతుందన్నారు.