సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో చివరి దశకు చేరుకున్న వివిధ ప్రగతి పనులను వెంటనే పూర్తి చేసి ప్రారంభించేందుకు సిద్దం చేయాలని జిల్లా కలెక్టర్ మనుచౌదరి అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పెండింగులో ఉన్న భూసేకరణ సత్వరమే పూర్తి చేయాలన్నారు. రోడ్లు భవనాలశాఖ, ఆర్ డబ్ల్యూఎస్, పంచాయతీరాజ్, పురపాలిక శాఖ ఇంజినీరింగ్ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.