సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గంలోని అక్కన్నపేట మండలంలో గౌరవెల్లి ప్రాజెక్ట్ ఆర్ అండ్ ఆర్ కాలనీలోని సేవాలాల్ మహారాజ్ తండాలో మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పర్యటించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ వెంట సిద్దిపేట కలెక్టర్ మను చౌదరి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. గౌరవెల్లి ప్రాజెక్ట్ లో భూనిర్వాసితుల సమస్యల పరిష్కారానికి అధికారులతో మంత్రి పొన్నం ప్రభాకర్ చర్చించారు.