దేశ సరిహద్దు రక్షణలో సైనికుల త్యాగాలు మరువలేనివని సిద్దిపేట మార్నింగ్ వాకర్స్ అసోసియేషన్ ప్రతినిధులు అన్నారు. సిద్ధిపేటలోని స్థానిక కోమటి చెరువు నెక్లెస్ రోడ్ వద్ద వినూత్నంగా గ్రాటీట్యూడ్ వాల్ ఏర్పాటు చేశారు. భారత్, పాకిస్థాన్ మధ్య ఇటీవల జరిగిన యుద్ధం నేపథ్యంలో మన దేశం, మన సైనికులపై ఉన్న అభిమానాన్ని గోడ మీద ఉన్న వస్త్రంపై అతికించారు. టూటౌన్ సీఐ ఉపేందర్ సైతం తన కుటుంబ సభ్యులతో కలిసి సందేశాన్ని అందించారు.