రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ప్రతి టిఆర్ఎస్ పార్టీ కార్యకర్త కంకణబద్ధులై కృషి చేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్ శనివారం పిలుపునిచ్చారు. హుస్నాబాద్ పట్టణ శివారులోని గార్డెన్లో హుస్నాబాద్ నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్, బీజేపీ ప్రభుత్వాల తీరును ఎండగట్టి, వాస్తవాలను ప్రజలకు తెలియపరచాలన్నారు.