అన్నదాతకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ

79చూసినవారు
అన్నదాతకు ఆరంభంలోనే ఎదురుదెబ్బ
ఆరుగాలం శ్రమించి పండించిన పంట భారీ వర్షాలకు అతలాకుతలమైంది. సాగు చేసిన కొద్ది రోజులకే అనుకోని రీతిలో వచ్చిన అకాల వర్షాల వల్ల అన్నదాతలకు కోలుకోలేని దెబ్బతీసింది. ప్రభుత్వం ఆదుకోవాలని రైతులు గురువారం విజ్ఞప్తి చేస్తున్నారు. 17 మండలాల్లో సాధారణం కంటే ఎక్కువగా వర్షపాతం నమోదు కాగా, మిగతా మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలకు మెదక్ జిల్లాలో ఉన్న చెరువులు, కుంటల్లోకి పెద్ద ఎత్తున్న నీళ్లు చేరాయి.

సంబంధిత పోస్ట్