మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తి చెరువులో మృతదేహమై తేలిన ఘటన మెదక్ జిల్లా నిజాంపేట మండలంలో జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం. మండలంలోని రాంపూర్ గ్రామానికి చెందిన దేవరాజు(32) ఈనెల 25న ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కాగా గ్రామ శివారులోని చెరువులో దేవరాజు మృతదేహం తేలింది. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.