మెదక్ జిల్లాలోని అన్ని పాఠశాలలకు ఈ నెల 3 నుంచి 14వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటిస్తూ జిల్లా విద్యాధికారి రాధా కిషన్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 15వ తేదీన తిరిగి పాఠశాలలు ప్రారంభమవుతాయని చెప్పారు. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.