రైతును హత్య చేసిన కేసులో నలుగురు అరెస్ట్

64చూసినవారు
రైతును హత్య చేసిన కేసులో నలుగురు అరెస్ట్
రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో ఈనెల 27న జరిగిన రైతు హత్య కేసును పోలీసులు ఛేదించారు. గ్రామానికి చెందిన రైతు రాగుల అశోక్ అనే రైతును అదే గ్రామానికి చెందిన చేవూరి రమేష్ కుటుంబ సభ్యులు పొలం గట్టు వివాదంలో హత్య చేసినట్టు రామాయంపేట సీఐ వెంకట్ రాజా గౌడ్ తెలిపారు. హత్య చేసిన అనంతరం పరారీలో ఉన్న చేవూరి రమేష్, అతని భార్య వెంకటలక్ష్మి, కుమారులు వినయ్ తేజ, భరత్ తేజ అనే నలుగురిని అరెస్టు చేశారు.

సంబంధిత పోస్ట్