చిరుత సంచారంతో ప్రజలు బెంబేలు

85చూసినవారు
చిరుత సంచారంతో ప్రజలు బెంబేలు
రామాయంపేట మండలం ఝాన్సీ లింగాపూర్ గ్రామ శివారులోని వ్యవసాయ పొలాల వద్ద చిరుత పులి సంచరిస్తుందని రైతులు తెలిపారు. మంగళవారం రాత్రి గ్రామానికి చెందిన ఇప్పరాజు అనే రైతుకు చెందిన వ్యవసాయ పొలం వద్ద పశువుపై చిరుత పులి దాడి చేసి చంపేసింది. ఉదయం పొలం వద్దకు వెళ్లిన రైతులు పశువును చూసి ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేశారు. చిరుత పులి సంచారంపై స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్