ప్రమాదవశాత్తు చెరువులో పడి వ్యక్తి మృతి చెందిన విశాల ఘటన టేక్మాల్ లో చోటుచేసుకుంది. ఎస్సై రాజేశ్ శనివారం తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన బాజా విఠల్ చెరువులో మేకలను కడుగుతున్న క్రమంలో ప్రమాదవశాత్తు చెరువులో పడి మునిగిపోయాడు. గజ ఈతగాళ్ల సహాయంతో మృతదేహన్ని వెలికితీశారు. పోస్టుమార్టం నిమిత్తం జోగిపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించామన్నారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.