భూ భారతి చట్టంపై మండలాల్లో అవగాహన సదస్సులను పక్కాగా నిర్వహించాలని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ బుధవారం ఆదేశించారు. కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఆర్డీవోలు, తహశీల్దార్లు, సివిల్ సప్లై అధికారులతో భూ భారతి చట్టం, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణపై సమీక్షించారు. జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాలను త్వరితగతిన ప్రారంభించి కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేయాలన్నారు.