మెదక్ జిల్లా టేక్మాల్ మండలానికి చెందిన బాజ్ విరల్ (32) వ్యవసాయంతో పాటు మేకల వ్యాపారం చేసుకుంటూ జీవనోపాధి పొందుతున్నాడు. శుక్రవారం మేకలను శుభ్రం చేయడానికి దగ్గరలో ఉన్న చెరువుకు వెళ్లి, అక్కడ ఉన్న గుంతలో పడి మునిగిపోయాడు. సమాచారం అందుకున్న స్థానికులు గాలించి శవాన్ని బయటకు తీశారు. మృతుడికి భార్య మంజుల, ఇద్దరు పిల్లలు ఉన్నారు. పోలీసులకు ఆమె ఫిర్యాదు చేసింది.