మెదక్ జిల్లా శివంపేట మండలం దొంతి జాతీయ రహదారిపై దంపతులకు రోడ్డు ప్రమాదం జరిగింది. తూప్రాన్-నర్సాపూర్ ప్రధాన రహదారిపై బైక్ ను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో బైక్ పై ఉన్న భర్త అక్కడికక్కడే మృతిచెందాడు. భార్యకు గాయాలయ్యాయి. మృతుడు సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లికి చెందిన వ్యక్తిగా గుర్తించారు.